: వికీపీడియా ప్రొఫైల్స్ ను సవరించుకుంటున్న నేతలు
త్వరలో కొన్ని రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయనేతలు వికీపీడియాలో తమ ప్రొఫైల్స్ ను సవరించే పనిలోబడ్డారు. నేటితరం ఎక్కువగా ఆన్ లైన్ సమాచారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో... ఓటర్లు తమ గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్ ను ఆశ్రయిస్తారని రాజకీయనేతలు భావిస్తున్నారు. అందుకోసం వారు తమ ప్రొఫైల్స్ లోని వివాదాస్పద వివరాలను తొలగించి, మరింత ఆకర్షణీయంగా మలిచేందుకు నడుం బిగించారు. వికీపీడియా సమాచారాన్ని ఎవరైనా ఎడిట్ చేసే అవకాశం ఉంది. నేతలకు సంబంధించిన కేసులు, ఇతర వివరాలను ఎవరైనా సదరు పేజీలో పొందుపరచవచ్చు. ఇప్పుడు నేతలు, వారి అనుయాయులు ఆ అవాంఛనీయ వివరాలను తొలగించేందుకు రంగంలోకి దిగారు.