: విజయ్ మాల్యాపై కేసు వేసిన కో- పైలట్


కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ చైర్మన్-కం-మేనేజింగ్ డైరక్టర్ విజయ్ మాల్యాకు ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. తనకు రావాల్సిన బకాయిలను కింగ్ ఫిషర్ సంస్థ ఇప్పటివరకు చెల్లించలేదంటూ ఆకాశ్ శర్మ అనే కో-పైలట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం మాల్యాకు సమన్లు జారీచేసింది. అక్టోబరు 6న మాల్యాను కోర్టులో హాజరుపరచాలని బెంగళూరు నగర పోలీస్ సూపరింటిండెంట్ ను ఆదేశించింది. కాగా, తాను 2006లో డెక్కన్ ఏవియేషన్ సంస్థలో కో-పైలట్ గా చేరానని, తదనంతరం కాలంలో ఆ సంస్థను కింగ్ ఫిషర్ సంస్థ టేకోవర్ చేసిందని తెలిపాడు. 2012లో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కార్యకలాపాలు నిలిచిపోగా, తనకు రూ.28.50 లక్షలు రావాల్సి ఉందని శర్మ తన పిటిషన్ లో పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News