: 'సార్క్'ను పునరుద్ధరించేందుకు ఎన్డీఏ కట్టుబడి ఉంది: రాజ్ నాథ్ సింగ్


'సార్క్'ను అతిపెద్ద వేదికగా పునరుద్ధరించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఖాట్మండులో జరిగే సార్క్ హొమ్ మంత్రుల సమావేశాలకు వెళుతున్న సందర్భంగా రాజ్ నాథ్ మాట్లాడుతూ "దక్షిణాసియాలోని దేశాలు తమ ప్రజల సంక్షేమాన్ని ప్రచారం చేసుకునేందుకు సార్క్ ప్రధాన వేదిక. అంతేకాక సమష్టి ఆత్మ విశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది" అని చెప్పారు. ప్రధాని మోడీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సార్క్ దేశాల అధినేతలను, ఇరుగు పొరుగు దేశాలను పిలిచి సంబంధాలను మరింత బలోపేతం చేశారని గుర్తుచేశారు.

  • Loading...

More Telugu News