: భారత్ - చైనాల మధ్య 12 కీలక ఒప్పందాలపై అవగాహన


భారత్, చైనా ప్రభుత్వాల మధ్య మొత్తం 12 కీలక ఒప్పందాలపై అవగాహన కుదిరింది. ఈ ఒప్పందాలకు సంబంధించిన పత్రాలను ఇరు దేశాల అధికారులు ఇచ్చిపుచ్చుకున్నారు. అంతకుముందు, భారత పర్యటనలో ఉన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఇక, రెండు దేశాల మధ్య కుదిరిన ప్రధాన ఒప్పందాలు ఇవే... * భారత్ -చైనా ఆర్థిక, వాణిజ్య ప్రణాళిక ఒప్పందం * రెండు దేశాల మధ్య సమాచార శాఖ ఒప్పందం * రైల్వే అభివృద్ధిపై ఒప్పందం * భారత్ - చైనా మధ్య మానస సరోవర్ మార్గం నిర్మాణంపై ఒప్పందం * ఐదేళ్ల పాటు భారత్ -చైనా మధ్య వ్యాపార, వాణిజ్య ఒప్పందం * షాంఘై- ముంబయి నగరాల అభివృద్ధిపై ఒప్పందం

  • Loading...

More Telugu News