: విశ్వవిద్యాలయాల్లో హిందీ బోధనను వ్యతిరేకించిన జయలలిత


దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో హిందీ భాష బోధించాలంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ ఆదేశాలు తమ రాష్ట్రానికి వర్తించవని ముఖ్యమంత్రి జయలలిత అన్నారు. తమిళనాడులోని ఇతర రాజకీయ పార్టీలు కూడా హిందీ బోధనను వ్యతిరేకిస్తున్నాయి. హిందీ బోధన కోసం చట్టంలో మార్పులు తేవాలని, కామర్స్ డిగ్రీ కోర్సులను హిందీలోనూ బోధించాలని కేంద్ర హోం శాఖ భాషా విభాగం ఇటీవల ఉత్తర్వులు పంపింది. అంతేగాక, దాని అమలుకు తీసుకుంటున్న చర్యలను కూడా తిరిగి తమకు తెలియజేయాలని ఆదేశించింది. వాస్తవానికి 2011లో అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో కేంద్ర హిందీ కమిటీ ఈ సర్క్యులర్ ను తొలుత జారీ చేసింది. ఆ నిర్ణయాన్నే ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం అనుసరించి తాజాగా ఉత్తర్వులు పంపింది.

  • Loading...

More Telugu News