: తెలంగాణ, ఆంధ్రా... ఎమ్మెల్యే, ఎంపీ తోపులాట
పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎంపీ మాగంటి బాబు, ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పరస్పరం దాడులకు దిగారు. వీరిద్దరి మధ్య తోపులాట చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరులో జరిగిన రివ్యూ సమావేశాన్ని ఆపాలంటూ ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. 'ఇప్పుడు తెలంగాణ ఏంటి? ఈ మండలాలు ఆంధ్రాలో కలిశాయి' అంటూ ఎంపీ మాగంటి బాబు సమావేశాన్ని కొనసాగించారు. దీంతో, ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు, ఎంపీ బాబులు పరస్పరం నెట్టుకున్నారు. దీంతో, రివ్యూ మీటింగ్ రసాభాసగా మారింది.