: పదకొండు రోజుల తర్వాత జమ్మూ కాశ్మీర్ సచివాలయం పునఃప్రారంభం
భారీ వర్షాలు, వరదలతో కకావికలమైన జమ్మూ కాశ్మీర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ క్రమంలో నేడు ఆ రాష్ట్ర సచివాలయాన్ని చాలా రోజుల తర్వాత ఈ ఉదయం 9.30 గంటలకు తెరిచారు. కేవలం పది శాతం మంది ఉద్యోగులే పని చేసేందుకు వచ్చారని సచివాలయ సెక్యూరిటీ ఇన్ ఛార్జ్ ఒకరు చెప్పారు. ఇప్పటికీ సచివాలయం చుట్టూ నీళ్ళు ఉన్నాయని, ప్రధానం ద్వారం ఒక అడుగు మేర నీటిలో మునిగి ఉందనీ అన్నారు. అటు, సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్ కూడా సరిగా లేదట. దాంతో, ఏడంతస్తుల భవనంలో పైభాగంలో ఉన్న కార్యాలయాలను తెరిచారని ఆ అధికారి వివరించారు.