: దర్గాలో మహేష్ బాబు... 'ఆగడు' హిట్టవ్వాలనేనా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గాను సందర్శించారు. ఖ్వాజా మొయినుద్దీన్ ఛిస్తీ వద్ద మహేష్ బాబు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహేష్ బాబు నటించిన 'ఆగడు' సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కానున్న నేపథ్యంలో ఆయన దర్గాను సందర్శించారు. 'ఆగడు' సినిమా విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. మహేష్ బాబు గతంలో 'బిజినెస్ మేన్', 'దూకుడు', 'వన్... నేనొక్కడినే' సినిమాల విడుదలకు ముందు కూడా దర్గాను సందర్శించారు.