: సంజయ్ దత్ ను 'బిగ్ బాస్' కు పంపండి, లాక్ చేస్తాం: సల్మాన్


తన మిత్రుడు సంజయ్ దత్ ను 'బిగ్ బాస్' రియాలిటీ షో హౌస్ కు ట్రాన్స్ ఫర్ చేయాలంటున్నాడు సల్మాన్ ఖాన్. సంజయ్ దత్ ను తమ 'హౌస్'లో లాక్ చేస్తామని చెప్పాడు. మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సల్మాన్ పైవిధంగా బదులిచ్చాడు. ఒకవేళ సంజయ్ దత్ 'బిగ్ బాస్' హౌస్ కు వచ్చినా, ఉండలేకపోవచ్చని సల్మాన్ అభిప్రాయపడ్డాడు. 'బిగ్ బాస్' హౌస్ కంటే జైలే నయమనుకుంటాడని సల్మాన్ చమత్కరించాడు. కాగా, బిగ్ బాస్ తాజా సీజన్ ప్రీమియర్ ఈనెల 21న 'కలర్స్' చానల్లో కనువిందు చేయనుంది. బిగ్ బాస్ రియాలిటీ షోకు సల్మాన్ హోస్టుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News