: జమ్మూకాశ్మీర్ కు కేంద్రం భారీ సాయం
జమ్మూ కాశ్మీర్ వరద బాధితుల పునరావాసం నిమిత్తం పలువురి నుంచి విరాళాలు అందుతున్నాయి. తాజాగా కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూ.120 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంతేగాక, ఆ శాఖ మంత్రి సహా అధికారులు, ఇతర సిబ్బంది తమ ఒకరోజు జీతాన్ని ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇవ్వనున్నట్లు ఢిల్లీలో జరిగిన సమావేశంలో మంత్రి నజ్మా హెప్తుల్లా తెలిపారు.