: రజనీకాంత్ పిటిషన్ పై ఆదిత్య మీనన్ స్పందన


బాలీవుడ్ సినిమా 'మై హూ రజనీకాంత్'పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మద్రాస్ హైకోర్టులో కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దానిపై కోర్టు స్టే ఇచ్చింది కూడా. ఈ విషయంపై, 'మై హూ...'లో లీడ్ రోల్ పోషించిన ఆదిత్య మీనన్ మాట్లాడుతూ... ఈ సినిమా 'తలైవర్' (తమిళనాడులో రజనీకాంత్ బిరుదు) కు నీరాజనం వంటిదని చెప్పాడు. ఆయనను ఎక్కడా కించపరచలేదని స్పష్టం చేశాడు. ఇదో సెటైరికల్ కామెడీ చిత్రమని చెప్పాడు. "రజనీ సర్ ను తప్పుగా చూపించే దమ్మెవరికుంటుంది?" అని ఈ విలన్ పాత్రల నటుడు అన్నాడు. టైటిల్ ను పక్కనబెడితే, సినిమాలో ఆయనను చెడుగా చూపలేదని, సినిమా చూసిన అనంతరం ఇదో క్లీన్ ఎంటర్ టైనర్ అని ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని చెప్పుకొచ్చాడు. ఆదిత్య తెలుగులో హిట్టయిన 'ఈగ' సినిమాలో సుదీప్ ఫ్రెండ్ గా యాక్ట్ చేశాడు. ప్రభాస్ బ్లాక్ బస్టర్ 'మిర్చి'లో్నూ ప్రాధాన్యమున్న పాత్ర పోషించాడు. తాజాగా, 'మై హూ రజనీకాంత్' లో సీబీఐ ఆఫీసర్-కమ్-కాంట్రాక్ట్ కిల్లర్ గా ప్రధానపాత్రలో నటించాడు.

  • Loading...

More Telugu News