: భారత్ చిత్రాలు 'ఆస్కార్' స్థాయిలో రూపొందకపోవడంపై షాహిద్ విశ్లేషణ
ప్రతి ఏడాది ఆస్కార్ అవార్డుల్లో భారతీయ చిత్రాలు సత్తా చాటకపోవడంపై బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తనదైన విశ్లేషణ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల కోసం సినిమాలు రూపొందించకపోవడమే ప్రధాన కారణమంటున్నాడు. ఈ మేరకు మాట్లాడుతూ, "మనకు సొంతంగా ఓ భారీ పరిశ్రమ ఉంది. సినిమాలు రూపొందించడంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నాం. మన ప్రేక్షకుల గురించి ఆలోచించే మనం చిత్రాలు తీస్తాం. హాలీవుడ్ సినిమాల కంటే ఇక్కడి ప్రేక్షకుల అభిరుచి భిన్నంగా ఉంటుంది. అందుకే, కొన్ని మాత్రమే ఇక్కడ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందుతున్నాయి" అని షాహిద్ విశ్లేషించాడు. కాగా, భారత్ లో సినిమా తీసి ఆస్కార్ కు వెళ్లాలని అనుకోవడం చాలా తెలివితక్కువ పనిగా భావిస్తానన్నాడు. ప్రస్తుతం తాను నటించే చిత్రాలు కూడా భారత్ లో ఉండే వారు ఇష్టపడాలనే చేస్తానని వివరించాడు.