: శిశు మరణాల్లో భారత్ నెంబర్ వన్


వివిద కారణాలతో సంభవిస్తున్న శిశుమరణాలలో భారత్ నెంబర్ వన్ గా నిలిచింది. 1990 నుంచి శిశుమరణాలపై భారత్ దృష్టి సారించినప్పటికీ నేటికీ భారతే వీటిని అరికట్టలేక, మరణాల సంఖ్యలో అగ్రభాగాన నిలుస్తోంది. ఐక్యరాజ్యసమితి వెల్లడించిన గణాంకాల ప్రకారం 1990లో భారత్ లో 33.3 లక్షల మంది చిన్నారులు మృత్యువాత పడగా, ఆ సంఖ్య 2013లో 13.4 లక్షల మంది చిన్నారులకు పరిమితమైందని నివేదికలు వెల్లడించాయి. రెండు దశాబ్దాల కాలంలో భారత్ అద్భుతమైన పురోగతి సాధించినప్పటికీ, నేటికీ భారత్ లోనే అత్యధిక శిశుమరణాలు సంభవించడం దురదృష్టకరమని ఐక్యరాజ్యసమితి వ్యాఖ్యానించింది. ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల్లో సగం మరణాలు భారత్ (21 శాతం), నైజీరియా (13 శాతం), పాకిస్థాన్, కాంగో, చైనాల్లో నమోదవుతున్నాయని వెల్లడించింది. కాగా, నవజాత శిశు మరణాలను నివారించడంలో భారత్ గణనీయమైన వృద్ధి సాధించిందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. అయితే, వీరిలో ఎక్కువగా నివారించదగ్గ రోగాల బారిన పడి మృతి చెందుతున్నారని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.

  • Loading...

More Telugu News