: మోడీ 'టీచర్స్ డే' ప్రసంగానికి రికార్డు వ్యూయర్ షిప్
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి రికార్డు వ్యూయర్ షిప్ లభించింది. సెప్టెంబర్ 5న ఆయన చేసిన ప్రసంగాన్ని రికార్డు స్థాయిలో 2.14 కోట్ల మంది వీక్షించారట. మోడీ స్పెషల్ స్పీచ్ ఆయా చానళ్ళలో లైవ్ టెలికాస్ట్ అయింది. దేశవ్యాప్తంగా 8.5 లక్షల స్కూళ్ళకు చెందిన 90 మిలియన్ల మంది విద్యార్థులను ఉద్దేశించి మోడీ మాట్లాడారు. ఆయన తన ప్రసంగంలో ఉపాధ్యాయులకు కూడా దిశానిర్దేశం చేశారు. కాగా, ఒక్క డీడీ న్యూస్ చానల్లోనే మోడీ 'టీచర్స్ డే' కార్యక్రమాన్ని 19 లక్షల మంది చూశారట. దేశంలోని చానళ్ళ టీఆర్పీ రేటింగ్స్ ను పర్యవేక్షించే టీఏఎమ్ సంస్థ ఈ వివరాలు తెలిపింది.