: ప్రతి తొమ్మిది మందిలో ఒకరిది కాలే కడుపే
ప్రపంచంలోని ప్రతి తొమ్మిది మందిలో ఒకరిది కాలే కడుపేనని ఐక్యరాజ్యసమితి నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత 20 ఏళ్లలో ఆకలి కేకలు తగ్గినప్పటికీ పేదరికం రూపుమాపలేకపోయామని తెలిపింది. ఒక్క ఆఫ్రికాలోనే ఆకలి బాధితుల సంఖ్య 25 శాతం ఉంటుందని తెలిపిన ఐక్యరాజ్యసమితి, ఆసియాలో 52 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారని వెల్లడించింది. ఆకలి బాధితుల సంఖ్యను తగ్గించాలన్న లక్ష్యాన్ని చాలా దేశాలు అధిగమించినప్పటికీ, పలుదేశాలు విఫలమయ్యాయని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో వివరించింది.