: శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్
దుబాయ్ నుంచి సింగపూర్ వెళ్తున్న ఎమిరేట్స్ విమానం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. విమానంలోని ఓ ప్రయాణికుడికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అతను తన పరిస్థితిని విమాన సిబ్బందికి వివరించాడు. దీంతో, అప్రమత్తమైన విమాన సిబ్బంది ఎయిర్ పోర్టు అధికారులను సంప్రదించారు. విమానాశ్రయాధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అప్పటికే సిద్ధంగా ఉన్న అంబులెన్స్ లో అతనిని అపోలో ఆసుపత్రికి తరలించారు. అనంతరం విమానం సింగపూర్ బయల్దేరింది.