: నేడు హైదరాబాదుకు 14వ ఆర్థిక సంఘం రాక


14వ ఆర్థిక సంఘం నేడు హైదరాబాద్ వస్తోంది. తెలంగాణ ప్రభుత్వంతో భేటీ కోసం వస్తున్న ఆర్థిక సంఘం ప్రతినిధులకు కేసీఆర్ చారిత్రక ఫలక్ నూమా ప్యాలెస్ లో నేటి రాత్రి ప్రత్యేక విందును ఇవ్వనున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి మెరుగైన సాయం వచ్చేలా సూచనలు చేయాలని ఆర్థిక సంఘాన్ని కోరనున్న సీఎం కేసీఆర్, విందు రాజకీయంతోనూ తన పనిని మరింత సులభతరం చేసుకునేందుకు యత్నిస్తున్నారన్న ఆరోపణలూ లేకపోలేదు. నేటి రాత్రి విందు అనంతరం శుక్రవారం ఉదయం ఆర్థిక సంఘం, తెలంగాణ సర్కారుతో భేటీ కానుంది.

  • Loading...

More Telugu News