: అమెరికా అధ్యక్ష పదవి రేసులో భారతీయుడు
అమెరికా అధ్యక్ష పదవి రేసులో భారతీయ సంతతి వ్యక్తి పోటీపడనున్నారు. లూసియానా గవర్నర్ గా, సమర్థవంతమైన రాజకీయ నేతగా మన్ననలందుకున్న బాబీ జిందాల్ రానున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. 2016లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నాననీ... నవంబర్ లో జరిగే కాంగ్రెస్ ఎన్నికల తరువాత, దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటానని జిందాల్ వెల్లడించారు.