: మగాళ్లు ఒట్టి మాయగాళ్లు!: హాలీవుడ్ సుందరి కెల్లీ బ్రూక్
ప్రేమికులు విడిపోవడాలు, మళ్లీ కలవడాలు మామూలే... అదే సినీ తారలు, సెలబ్రిటీలు అయితే అది మరింత మామూలు వ్యవహారం. హాలీవుడ్ సుందరి కెల్లీ బ్రూక్ తన లవర్స్ పై మండిపడుతోంది. బీల్లీ జేన్, జాసన్, డానీ సిప్రియానీ లు ముగ్గురూ కెల్లీ బ్రూక్ మాజీ ప్రియులు. డానీతో ప్రేమ ముగింపుకొచ్చింది. సరిగ్గా ఈ సమయంలోనే జాసన్ ఫోన్ చేసి కెల్లీ నువ్వంటే నాకింకా ప్రేమ తగ్గలేదనడంతో ఆమె అతనికి ఒకే చెప్పింది. అప్పుడే ఆమెకు అసలు విషయం అర్థమైంది... జాసన్ కి అతని గర్ల్ ఫ్రెండ్ షాకిచ్చిందని. అందుకే తన వెంటపడుతున్నాడని తెలిసిపోయింది. దీంతో 'మగాళ్లు ఒట్టి మాయగాళ్లు' అంటూ పాటందుకుంది!