: ఎన్నారై పెళ్లికొడుకులొద్దు... భారత సంప్రదాయమే కావాలి!
పెళ్లిని జీవితంలో అత్యంత విలువైన ఘట్టంగా భావిస్తున్న భారతీయ యువతులు, ఈ విషయంలో చాలా స్పష్టమైన వైఖరిని ప్రదర్శిస్తున్నారు. పెళ్లి సంబంధాలకు సంబంధించిన ఓ పోర్టల్ నిర్వహించిన అధ్యయనంలో భారతీయ మహిళలు తమ అంతరంగం విప్పారు. భారతీయ విలువలు, సంప్రదాయాలను వ్యతిరేకించే ఎన్నారై పురుషులను పెళ్లి చేసుకునేందుకు మహిళలు ఏమాత్రం ఇష్టపడట్లేదని ఓ అధ్యయనం తెలిపింది. అసలలాంటి దృక్పథం ఉన్న ఎన్నారై సంబంధాలను సగానికిపైగా మహిళలు నిష్కర్షగా తిరస్కరించారని ఆ అధ్యయనం వెల్లడించింది. విదేశాలకు వెళ్లి అక్కడి ఆహార్యాన్ని అలవాటు చేసుకున్న పురుషులను 66.7 శాతం మంది మహిళలు తిరస్కరించారని ఆ పోర్టల్ తెలిపింది. అలాగే, మాతృభూమిలో నేర్చిన విలువలు, సంప్రదాయాల పట్ల గౌరవం లేని పురుషులను 51.7 శాతం మంది తిరస్కరించారని ఆ అధ్యయనం వెల్లడించింది. ఆన్ లైన్ లో నిర్వహించిన ఈ అధ్యయనంలో భారతదేశ వ్యాప్తంగా ఉన్న అవివాహిత మహిళలు పాలుపంచుకున్నారని పోర్టల్ వివరించింది.