: రాణించిన రస్సెల్, టెన్ డెస్కోటే... కోల్ కతా శుభారంభం
ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ20 ట్రోఫిలో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు శుభారంభం చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్ కతా జట్టు, చెన్నైను 157 పరుగులకు కట్టడి చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన కోల్ కతా మొదట్లో తడబడ్డప్పటికీ రస్సెల్ (58), టెన్ డెస్కోటే (51) వీరవిహారం చేయడంతో విజయం సాధించింది. 20 ఓవర్లలో చెన్నై ఉంచిన లక్ష్యాన్ని కోల్ కతా కేవలం 19 ఓవర్లలోనే ఛేదించి సత్తా చాటింది.