: అది రాష్ట్ర విభజన కాదు, దేశ విభజన... ప్రపంచంలో ఓ అద్వితీయ ఘట్టం!


'స్వాతంత్ర్యం మా జన్మ హక్కు' అంటూ నినదిస్తున్న స్కాట్ లాండ్ ప్రజలో వైపు... 307 ఏళ్ల అనుబంధాన్ని ఎలా తెంచుకుంటాం? అంటున్న బ్రిటన్ వాసులు మరోవైపు. ఇంతకీ బంధం నిలుస్తుందా? తెగుతుందా? అంటూ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ప్రపంచ చరిత్రలో మరో స్వాతంత్ర్య ఘట్టం ఆవిష్కృతమవుతోంది. ప్రజాస్వామ్యానికి బ్రిటన్ సరైన అర్థం చెబుతోంది. ప్రజల అభీష్టానికి అనుగుణంగా స్కాట్ లాండ్ లో బ్రిటన్ ప్రభుత్వం రేపు రెఫరెండం నిర్వహిస్తోంది. గత కొన్నాళ్లుగా స్కాట్ లాండ్ లో స్వాతంత్ర్య అనుకూల, వ్యతిరేక వర్గాల ప్రచారం ముమ్మరంగా సాగింది. అయితే కలిసుందామనే బ్రిటన్ నేతల భావోద్వేగ అభ్యర్థన ఫలిస్తుందా? లేక విడిపోవాలనే స్కాట్ లాండ్ నేతల ఆలోచనకు అక్కడి ప్రజలు పట్టం కడతారా? అనేది ఎవరూ ఊహించలేకపోతున్నారు. దాదాపు 43 లక్షల మంది ప్రజలు కలిగిన స్కాట్ లాండ్ లో 16 ఏళ్లు దాటిన వారంతా రెఫరెండంలో పాల్గొనేందుకు అర్హులు. వీరంతా 'ఎస్' లేదా 'నో' అనే ఏకవాక్య సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దీంతో ప్రజల నిర్ణయంపై ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ రెఫరెండంతో కేవలం స్కాట్ లాండ్ భవితవ్యమే కాదు, యూరోప్, ప్రధానంగా బ్రిటన్ ఆర్ధిక వ్యవస్థ దశ, దిశ కూడా తేలిపోనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News