: రాంగోపాల్ వర్మకు ఊరట
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట లభించింది. వినాయకుడిపై ట్విట్టర్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రాంగోపాల్ వర్మపై రెండు వేర్వేరు ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో తదుపరి విచారణపై హైదరాబాద్ హైకోర్టు స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుల నమోదు, విచారణలకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.