: ఎట్టకేలకు అద్వానీకి దక్కిన పదవి
బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీని పదవి వరించింది. వయో భారం కారణంగా కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కని అద్వానీని, లోక్ సభ నైతిక విలువల కమిటీ అధ్యక్షుడిగా నియమిస్తూ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్ణయం తీసుకున్నారు. అద్వానీ అధ్యక్షతన ఈ కమిటీ లోక్ సభ సభ్యులకు సభలో పాటించాల్సిన నైతిక విలువలను సూచించడంతో పాటు వారి ప్రవర్తనను పర్యవేక్షించనుంది. ఈ కమిటీలో టీడీపీ ఎంపీ చామకూర మల్లారెడ్డి సభ్యుడు కాగా, అరుమోజితెవాన్, నినాంగ్ రింగ్, షేర్ సింగ్ గుబే, హేమంత్ తుకారం, ప్రహ్లాద్ జోషి, భగవత్ సింగ్ కోష్యారి, అర్జున్ రామ్ మెగ్వాల్, భత్రుహరి, కరియా ముండే, జయశ్రీబెన్ పటేల్, సుమేథనాధ్ సరస్వతి, భోల్ సింగ్ లను సభ్యులుగా నియమించారు.