: నిద్రపోతున్న మహిళపై అత్యాచారం చేసి దేశం దాటిపోయాడు


నిద్రిస్తున్న మహిళపై అత్యాచారానికి పాల్పడి, తప్పుడు పాస్ పోర్టుపై దేశం విడిచి పారిపోయాడో ప్రబుద్ధుడు. అయితే, కొన్నాళ్లకు అది అందరూ మర్చిపోయి వుంటారులే అనుకుని, మళ్లీ ఇండియాకొచ్చి ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. ప్రవాస భారతీయుడు తాజిందర్ పాల్ సింగ్ (29) కి న్యూజిలాండ్ న్యాయస్థానం ఆరేళ్ల తొమ్మిది నెలల జైలు శిక్ష విధించింది. తాత్కాలిక విజిట్ వీసాపై న్యూజిలాండ్ వచ్చిన అతడు క్రైస్ట్ చర్చ్ ప్రాంతంలో నిద్రిస్తున్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిని స్థానిక మీడియా వెల్లడించింది. దీంతో మరొకరి పాస్పోర్టుపై అతను స్వదేశానికి వచ్చేశాడు. కొద్ది రోజుల తరువాత మళ్లీ న్యూజిలాండ్ వెళ్లాడు. దీంతో న్యూజిలాండ్ పోలీసులు అతడిపై అత్యాచారం, నకిలీ పాస్పోర్టు వ్యవహారంపై కేసు నమోదు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం తాజిందర్ కు జైలు శిక్ష ఖరారు చేసింది.

  • Loading...

More Telugu News