: విభజన చట్టంలో పేర్కొన్న ప్రోత్సాహకాల కోసం ఢిల్లీ వెళ్లిన తెలంగాణ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న ప్రోత్సాహకాలపై కేంద్రంతో చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి ఢిల్లీ వెళ్లారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయన కేంద్రంతో సంప్రదింపులు జరపనున్నారు. విభజన అనంతరం రాష్ట్రానికి రావాల్సిన ప్రోత్సాహకాల ప్రతిపాదనలను ఆయన కేంద్రానికి సమర్పించనున్నారు.