: జమ్మూ కాశ్మీర్ బాధితులకు నాగాలాండ్ ఆర్థిక సాయం
జమ్మూ కాశ్మీర్ వరద బాధితులకు నాగాలాండ్ ప్రభుత్వం తన వంతు ఆర్థిక సాయం ప్రకటించింది. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అంతేగాక జమ్మూ కాశ్మీర్ బాధితులకు సహాయం చేసేందుకు ఎన్జీవోలు, గ్రామ సమాఖ్యలు ఇతరులు స్పందించాలని, విరాళం అందించేందుకు ముందుకు రావాలని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నాగాలాండ్ బ్రాంచ్ విజ్ఞప్తి చేసింది.