: మీరే చెప్పండి... భారత్ పేద దేశమా? ధనిక దేశమా?


నిన్న మొన్నటి వరకు భారతదేశమంటే విదేశీయులకు పేద దేశమంటూ చులకన. ఇప్పుడు అగ్రరాజ్యాలకు వ్యూహాత్మక భాగస్వామి. మరి, భారత రాజకీయ నాయకుల దృష్టిలో అభివృద్ధి చెందుతున్న, పుష్కలమైన వనరులున్న దేశం. సాధారణ పౌరులకు మాత్రం అవసరాలు తీరని దేశం. కానీ, తాజా నివేదికల ప్రకారం కుబేరుల దేశం. భారతదేశంలో సుమారు వందమంది బిలియనీర్లు ఉన్నట్టు అధ్యయనాలు వెల్లడించాయి. దీంతో, గతేడాదిలానే ఈ ఏడాది కూడా ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు కలిగిన దేశాల్లో ఒక దేశంగా భారత్ ఆరోస్థానాన్ని నిలుపుకుంది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 2,325 మంది బిలియనీర్లు ఉండగా, 571 మంది బిలియనీర్లతో యూఎస్ నెంబర్ వన్ లో నిలవగా, 190 మంది బిలియనీర్లతో చైనా రెండో స్థానంలో నిలిచింది. 130 మంది బిలియనీర్లతో మూడో స్థానంలో యూకే నిలిచింది. కాగా, స్విస్, హాంగ్ కాంగ్, ఫ్రాన్స్ దేశాలకంటే ముందర వంద మంది బిలియనీర్లతో భారత్ ఆరోస్థానంలో నిలించింది. మరి మీరే చెప్పండి... భారతదేశం పేద దేశమా? ధనిక దేశమా?

  • Loading...

More Telugu News