: బృందావనంలో బీహార్, బెంగాల్ వితంతువులు... ఇదేమని ప్రశ్నించిన ఎంపీ హేమమాలిని
వితంతువులపై ఇటీవల బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి హేమమాలిని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే, ఇటీవల మధురలోని బృందావనం వెళ్లిన హేమ అక్కడ ఓ ఇంటిలో దారుణ పరిస్థితిలో ఆశ్రయం పొందుతున్న వితంతువులను కలిసింది. వారిలో బీహార్, పశ్చిమబెంగాల్ కు చెందిన వితంతు మహిళలు కూడా ఉన్నారని తెలిసి వెంటనే ప్రశ్నించింది. ఈ విషయంపై తాను ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడతానని చెప్పింది. ఇందుకు స్థానిక కాంగ్రెస్ నేతలు హేమపై మండిపడగా, ఆమె వ్యాఖ్యలను అక్కడి స్థానికులు మాత్రం సమర్థిస్తున్నారు. ఏ రాష్ట్రానికి చెందిన వారికి, ఆ రాష్ట్ర ప్రభుత్వమే సౌకర్యాలు కల్పించాలని ఓ స్థానిక దుకాణదారుడు అంటున్నాడు.