: 25 లక్షల హిట్లు కొల్లగొట్టిన శంకర్ 'ఐ'
ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ ఏది చేసినా అద్భుతమే. 'జెంటిల్ మేన్' నుంచి 'రోబో' వరకు ఆయన సినిమాలన్నీ సామాజిక బాధ్యత నేపథ్యంలోనివే. ఇక కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటన గురించి చెప్పడానికి మాటలు చాలవు. సినీ పరిశ్రమలో ఆయన చేసినన్ని ప్రయోగాలు ఆయన సమకాలీన హీరోల్లో మరెవరూ చేసి ఉండరంటే అతిశయోక్తి కాదు. శంకర్, విక్రమ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన 'అపరిచితుడు' పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న 'ఐ' సినిమా నిర్మాణం నుంచి సినిమాలకు సరికొత్త ఒరవడి నేర్పుతోంది. 'ఐ' టీజర్ కు యూట్యూబ్ లో లభిస్తున్న ఆదరణను చూసి దానిని విడుదల చేసిన సోనీ మ్యూజిక్ ఆశ్చర్యపోయింది. 'ఐ' సినిమా టీజర్ విడుదలైన 24 గంటల్లోనే 25లక్షల హిట్లు దాటిపోయాయి. 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. టీజర్ లో విక్రమ్ ను చూస్తే సినిమా స్వరూపం తెలిసిపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా భారతీయ సినిమా రికార్డులను చెరిపేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.