: నందిగామ ఎమ్మెల్యేగా తంగిరాల సౌమ్య ప్రమాణ స్వీకారం
కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గ ఉపఎన్నికలో గెలిచిన తంగిరాల సౌమ్య ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు హైదరాబాదులోని తన ఛాంబర్ లో ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిశోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. గెలిచిన రెండవ రోజే ఆమె ప్రమాణ స్వీకారం చేశారు.