: ఆరు రోజులు... ఆరుగురు... ఆమెకు నరకం చూపించారు
అరాచకాల ఉత్తరప్రదేశ్ లో దారుణాలకు అడ్డుకట్టపడడం లేదు. కామాంధుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా ఆరుగురు వ్యక్తులు ఓ విద్యార్థినిని కిడ్నాప్ చేసి ఆరు రోజులపాటు సామూహిక అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపుతోంది. చాందౌలి జిల్లా ఇల్లియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 9న ప్లస్ టు చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని స్కూల్ కు వెళుతుండగా, ఆరుగురు వ్యక్తులు ఆమెను అటకాయించి, బలవంతంగా కారులో ఎత్తుకెళ్లారు. ఆమెను అలహాబాద్ తీసుకువెళ్లి నిర్బంధించారు. అలా ఆరు రోజుల పాటు ఆరుగురు దుండగులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాగా నీరసించిన బాలికను వారణాసి తీసుకువచ్చి రైల్వే స్టేషన్ వద్ద వదిలిపెట్టారు. వారిలో ఒకడు బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వారు రైల్వే స్టేషన్ కు చేరుకుని, బాలికను తీసుకుని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.