: విశాఖలో చాలా పరిశ్రమలు రాబోతున్నాయి: గంటా
విశాఖపట్టణానికి చాలా పరిశ్రమలు రాబోతున్నాయని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, నిరుద్యోగులకు ఉపాధి కల్పనే ధ్యేయంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. గత ప్రభుత్వాలు వేల ఎకరాలు పరిశ్రమలకు కేటాయించి, 40 వేల మందికి ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి కేవలం 3 వేల మందికే ఉపాధి కల్పించాయని ఆయన తెలిపారు. ఉపాధి కల్పనపై ఒక్క ఎస్ఈజడ్ కూడా హామీ నెరవేర్చలేదని గంటా స్పష్టం చేశారు.