: టీఆర్ఎస్ నేతలు ఖాసిం రజ్వీ వారసులు: రాపోలు
టీఆర్ఎస్ నేతలు రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ వారసులని ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ పేర్కొన్నారు. హైదరాబాదులోని సుల్తాన్ బజారులో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం నయా రజాకార్ల వ్యవస్థగా మారిందని అన్నారు. కేసీఆర్ అవకాశవాద రాజకీయాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకపోవడం ప్రభుత్వ అవకాశవాదానికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.