: మనదేశంలో కుబేరులు వీరే


బారత దేశంలోని సంపన్నుల జాబితా ఇదే. రూ.1.65 లక్షల కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ అగ్రస్థానాన్ని అధిష్ఠించగా, సన్ ఫార్మాస్యూటికల్స్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ షాంఘ్వీ రెండో స్థానంలో ఉన్నారు. అర్సెలర్ మిట్టల్ ఛైర్మన్, సీఈవో ఎల్ఎన్ మిట్టల్ మూడో స్థానంలో నిలిచారు. నాలుగో స్థానంలో విప్రో ఛైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ నిలిస్తే, ఐదవస్థానంలో హెచ్ సీఎల్ ఛైర్మన్ శివ్ నాడార్ ఉన్నారు. హిందూజా గ్రూప్ ఛైర్మన్ ఎస్పీ హిందూజా ఆరోస్థానంలో ఉండగా, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఛైర్మన్ పి.మిస్త్రీ ఏడో స్థానంలో నిలిచారు. ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమారమంగళం బిర్లా జాబితాలో ఎనిమిదో స్థానం సంపాదించగా, భారతీ ఎంటర్ ప్రైజెస్ ఛైర్మన్ గ్రూప్ సీఈవో సునీల్ మిట్టల్ తొమ్మిదోస్థానంలో ఉన్నారు.

  • Loading...

More Telugu News