: ఎంపీని ఎత్తి చెత్తకుండీలోకి విసిరేశారు!
ఎంపీని చెత్తకుండీలో వెయ్యడమా? అంత సాహసం ఎవరు చేశారని విస్తుపోతున్నారా? మనదేశంలో కాదు లెండి. ఎంపీలకు మనదేశంలో సెక్యూరిటీ, మందీమార్బలం దండిగా ఉంటాయి. ఇక్కడ ఎంపీని ముట్టుకునే సాహసం చేయడమా? అంత ధైర్యమెవరికైనా ఉంటుందా? ఇది ఉక్రెయిన్ లో జరిగింది. ఆ దేశంలోని విటలీ జురవ్ స్కీ అనే ఎంపీ వ్యవహారశైలితో విసుగు చెందిన ప్రజలు ఉక్రెయిన్ పార్లమెంటు ఎదుట చెత్తకుండీలోకి విసిరేశారు. అతను అక్కడి నుంచి లేవబోతుంటే మళ్లీ, మళ్లీ లోపలికి కూరేశారు. దీంతో, ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆయన పదవీచ్యుతుడైన ఉక్రెయిన్ అధ్యక్షుడు యనుకోవిచ్ కు అత్యంత సన్నిహితుడు.