: ఫ్యాన్స్ కు సౌరవ్ గంగూలీ విజ్ఞప్తి


ఫుట్ బాల్ అంటే విపరీతమైన అభిమానం కనబర్చే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఫ్యాన్స్ కు ఓ విజ్ఞప్తి చేశాడు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) లో పోటీ పడే తన జట్టు 'అట్లెటికో డీ కోల్ కతా(ఏటీకే)'కు మద్దతివ్వాలని సూచించాడు. గంగూలీ ఈ జట్టుకు సహ యజమాని. కోల్ కతాలోని సాల్ట్ లేక్ మైదానంలో మాట్లాడుతూ, ఇప్పటివరకు ఈస్ట్ బెంగాల్, మోహన్ బగాన్ జట్లకు మద్దతిచ్చారని, అలాగే, ఇక మీదట ఏటీకే సాకర్ జట్టుకు కూడా మద్దతివ్వాలని అభిమానులను కోరాడు. కాగా, ప్రపంచస్థాయి సాకర్ ఆటగాళ్ళు పాల్గొంటున్న ఐఎస్ఎల్ అక్టోబర్ 12న ప్రారంభం కానుంది. ఈ లీగ్ లో భారత్ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ జట్టు 'కేరళ బ్లాస్టర్స్' కూడా పాల్గొంటోంది.

  • Loading...

More Telugu News