: పరిటాల శ్రీరామ్ పేరు చెప్పుకుని దందాలు చేస్తోన్నవారిని అరెస్ట్ చేయండి: పరిటాల సునీత


అనంతపురం జిల్లాలో పరిటాల అనుచరులు అక్రమ దందాలకు పాల్పడుతున్నారన్న వార్తలను మంత్రి పరిటాల సునీత ఖండించారు. పరిటాల రవి, పరిటాల శ్రీరామ్ ల పేరు చెప్పుకొని ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆమె పోలీసులను ఆదేశించారు. ఇటీవల కాలంలో, పరిటాల శ్రీరామ్ పేరు చెప్పుకుని కొంతమంది బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూళ్లు చేస్తున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆమె స్పందించారు. ఇకపై, పరిటాల కుటుంబం పేరు చెప్పుకుని ఎవరైనా అక్రమ వసూళ్లకు, బెదిరింపులకు దిగితే తాము ఏమాత్రం సహించబోమని ఆమె హెచ్చరించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో ఓ ప్రముఖ న్యాయవాది తనకు వస్తున్న బెదిరింపులపై ఇటీవల పోలీసులకి ఫిర్యాదు చేశాడు. పరిటాల శ్రీరామ్ మనుషులమంటూ తనను కొంతమంది భారీమొత్తంలో డబ్బు కోసం వేధిస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతోపాటు ఇలాంటి సంఘటనలు మరికొన్ని పోలీసుల దృష్టికి రావడంతో పరిటాల అనుచరులు వసూళ్ల దందా మొదలుపెట్టారని అనంతపురం జిల్లాలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో, పరిటాల కుటుంబం పేరుతో ఎవరైనా వసూళ్లకు పాల్పడితే వారిని వెంటనే కట్టడి చేయాలని మంత్రి సునీత అనంతపురం పోలీసులను ఆదేశించారు. వసూళ్లకు పాల్పడే సంస్కృతి పరిటాల కుటుంబంలో లేదని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి వాటితో తమ కుటుంబానికి ఏమాత్రం సంబంధం లేదని ఆమె వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News