: 'మై హూ రజనీకాంత్' చిత్రంపై రజనీ పిటిషన్... విడుదలపై హైకోర్టు స్టే!


'మై హూ రజనీకాంత్' పేరుతో హిందీలో రూపొందిన చిత్రంపై నటుడు రజనీకాంత్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన అనుమతి లేకుండా దర్శక, నిర్మాతలు ఆ సినిమా నిర్మించారని, టైటిల్లో తన పేరు ఉపయోగించే ముందు అంగీకారం తీసుకోలేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో, సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు చిత్రం రిలీజ్ పై స్టే విధించింది. అనంతరం, విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News