: పాక్ ప్రధానిపై హత్య కేసు


పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆయన మంత్రి వర్గ సహచరులపై హత్య కేసు నమోదైందని ఇస్లామాబాద్ పోలీసులు తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల సందర్భంగా నిరసనకారుల మృతికి కారణమయ్యారంటూ పాకిస్థాన్ అవామీ తెహ్రీక్ (పీఏటీ) అధినేత తాహిరుల్ ఖాద్రీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఖాద్రీ పిటిషన్ ను పరిశీలించిన జిల్లా జడ్జి ప్రధానమంత్రి షరీఫ్ పై హత్య అభియోగాలు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో గతరాత్రి కేసు నమోదైంది. ఆగస్టు 30న జరిగిన ఆందోళనల సందర్భంగా ముగ్గురు చనిపోగా, 500 మంది దాకా గాయపడ్డారు. ఈ కేసులో... పాకిస్థాన్ పీనల్ కోడ్ అనుసరించి సెక్షన్ 302, టెర్రరిస్టు వ్యతిరేక చట్టంలోని సెక్షన్ 7ను కూడా పొందుపరిచామని పోలీసులు తెలిపారు. కాగా, ప్రధాని నవాజ్ షరీఫ్ పై ఇది రెండో హత్య కేసు. జూన్ లో 14 మంది పీఏటీ కార్యకర్తల మృతికి కారణమయ్యారంటూ దాఖలైన ఫిర్యాదు నేపథ్యంలో తొలి కేసు నమోదైంది. అప్పుడు కూడా ఖాద్రీనే ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News