: శంషాబాద్ విమానాశ్రయంలో 3 కిలోల బంగారం పట్టివేత
బంగారం అక్రమ రవాణా మితిమీరుతోంది. తాజాగా, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో మూడు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాదు వచ్చిన ఓ ప్రయాణికుడిని అనుమానంతో తనిఖీ చేయగా, అతని నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు. ఇటీవల కాలంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో తరచూ బంగారం పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.