: పరువునష్టం కేసులో సుబ్రహ్మణ్య స్వామికి సమన్లు
బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామికి చెన్నై స్థానిక కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 28న స్వయంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. కొన్ని రోజుల కిందట ప్రధానమంత్రి నరేంద్రమోడీకి రాసిన లేఖలో స్వామి తనపై ఆరోపణలు చేశారంటూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పరువునష్టం దావా వేశారు. ఆమె పిటిషన్ ను పరిశీలించిన కోర్టు పైవిధంగా స్పందించింది.