: టీవీ9, ఏబీఎన్ చానళ్లకు మద్దతు తెలిపిన మావోయిస్టులు
తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్, టీవీ9 చానళ్ల ప్రసారాల నిలిపివేతను మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఖండించింది. మీడియాపై కేసీఆర్ నియంతృత్వ ధోరణితో వ్యాఖ్యలు చేయడం, నిషేధ ఫత్వాలు విధించడాన్ని ఖండిస్తున్నామని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. ఎంఎస్వోల వెనుక ఉండి... టీవీ9,ఏబీఎన్ చానళ్ల ప్రసారాలను కేసీఆర్ ఆపివేయించారని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ఆరోపించారు. ఈ చర్య... కేసీఆర్ నియంతృత్వ లక్షణాలకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి ధోరణి మంచిది కాదని జగన్ అభిప్రాయపడ్డారు.