: ఐఎస్ఐఎస్ గ్రూపు పోప్ ఫ్రాన్సిస్ ను లక్ష్యంగా చేసుకుందా?


అమెరికా, బ్రిటీష్ జాతీయుల పీకలు కోసి, ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) గ్రూపు ఇప్పుడు పోప్ ఫ్రాన్సిస్ ను లక్ష్యంగా చేసుకుందా? అంటే, ఔననే అంటున్నారు వాటికన్ లో ఇరాక్ అంబాసడర్ హబీబ్ అల్ సదర్. 'లా నజియోన్' అనే ఇటాలియన్ దినపత్రికతో మాట్లాడుతూ, పోప్ కు ఐఎస్ఐఎస్ నుంచి ముప్పు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం ఉందని తెలిపారు. తన ప్రాబల్యాన్ని మరింతగా విస్తరించుకునేందుకు ఈ కిరాతక మూక పోప్ ను హత్య చేసే అవకాశాలున్నాయని సదర్ అభిప్రాయపడ్డారు. ముస్లిం ప్రాబల్య దేశం అల్బేనియాలో పోప్ ఫ్రాన్సిస్ పర్యటించాల్సి ఉన్న నేపథ్యంలో... వాటికన్ వర్గాలు స్పందిస్తూ, ముప్పు ఉందని తాము భావించడంలేదని, పోప్ పర్యటన జరుగుతుందని అన్నారు. భద్రత పెంచాల్సిన అవసరంలేదని, వాటికన్ లో ఉపయోగించే ఓపెన్ టాప్ జీపునే, పోప్, అల్బేనియాలోనూ ఉపయోగిస్తారని వాటికన్ ప్రతినిధి ఫాదర్ ఫెడరికో లొంబార్డి తెలిపారు. కాగా, ఇరాక్ లో మైనారిటీలకు వ్యతిరేకంగా చెలరేగిపోతున్న ఐఎస్ఐఎస్ మిలిటెంట్లపై దాడుల నిర్ణయాన్ని పోప్ సమర్థించారు.

  • Loading...

More Telugu News