: తెలంగాణ ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపేందుకే 'ఎల్ అండ్ టీ లేఖ' కథనాలు: కేటీఆర్
'ఎల్ అండ్ టీ లేఖ' వార్తలను తాను పత్రికల్లో, ఛానళ్లలో చూశానని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పత్రికల్లో వచ్చిన వార్తల్లో నిజం ఉందనుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ మెదక్ లో సాధించిన ఘనవిజయాన్ని పక్కదారి పట్టించేందుకే ఇలాంటి కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ ప్రభుత్వాన్ని మలినం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కథనాలు వెలువడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్కువ చేసి చూపించడమే మీడియా ఉద్దేశమని కేటీఆర్ తీవ్ర ఆరోపణ చేశారు.