: నా పనితీరు అర్థమవ్వాలంటే విపక్షాలకు మరికొంత సమయం పడుతుంది: మోడీ


సరికొత్త తరహాలో సాగుతోన్న తన పాలన విపక్షాలకు, విమర్శకులకు అర్థం కావాలంటే మరికొంత సమయం పడుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఈ మేరకు, తమ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు చేస్తున్న వారిని ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించారు. అహ్మదాబాదులో పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆయన ప్రతిపక్షాల విమర్శలకు జవాబిచ్చారు. జమ్మూకాశ్మీర్లో గడిచిన పదేళ్లలో ప్రధానులు ఎన్నిసార్లు పర్యటించారో... కేవలం మూడు నెలల వ్యవధిలో తాను అన్నిసార్లు సందర్శించానని మోడీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ పర్యటనకు ఎందుకొస్తున్నారని సభికులను ప్రశ్నించారు? దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది కాబట్టే ప్రపంచ దేశాల నేతలు భారత్ వైపు చూస్తున్నారన్నారు. సుస్థిర ప్రభుత్వాల ఏర్పాటు వల్ల దేశంలో ప్రజాస్వామ్యం బలోపేతమవుతుందని మోడీ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News