: ఉస్మానియా విద్యార్థులకు ఉద్యోగాలు ఎందుకివ్వాలి: నాయిని నర్సింహారెడ్డి


కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంపై ఆందోళన నిర్వహిస్తున్న ఉస్మానియా విద్యార్థులపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "అసలు ఉస్మానియాలో చదువుకుంటున్న వారందరూ పాసయ్యారా? వారికి ఉద్యోగాలు ఎందుకివ్వాలి?" అంటూ ఆయన ఒంటికాలిపై లేచారు. విద్యార్థుల ఆందోళనను కావాలనే కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయన్నారు. సికింద్రాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ కార్యాలయ ఆవరణలో జరిగిన జాతీయ కార్మిక విద్యాదినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 1969కి ముందు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరూ మావోయిస్టులుగా మారారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత తెలంగాణ ఉద్యమం ప్రజల నుంచి వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని 1,000 మందికి పైగా విద్యార్థులు బలిదానం చేసుకున్నారన్నారు.

  • Loading...

More Telugu News