: గోల్కొండపై జాతీయజెండా ఎగురవేయడానికి సిద్ధమైన బీజేపీ... అనుమతి లేదంటున్న పోలీసులు
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుంటే... తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అధికారికంగా నిర్వహించడంలేదని వారు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నేడు గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేయడానికి బీజేపీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఈ సందర్భంగా, లంగర్ హౌజ్ నుంచి గోల్కొండ కోట వరకు భారీ ర్యాలీని ప్లాన్ చేశారు. అయితే, గోల్కొండ కోట పురావస్తు శాఖ అధీనంలో ఉందని... గోల్కొండపై జెండా ఎగురవేయడానికి ఆ శాఖ అనుమతివ్వలేదని పోలీసులు చెబుతున్నారు. బీజేపీ నేతలను కోట లోపలకి వెళ్లనివ్వకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.