: నేడు తెలంగాణ విమోచన దినం
నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విమోచన దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. హైదరాబాద్ సంస్థానం భారత్ లో కలిసిన ఈ సందర్భాన్ని ఏ విధంగా పరిగణించాలన్న అంశంపై గత కొన్ని రోజులుగా పెద్ద చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భాన్ని తెలంగాణ విలీన దినంగా పరిగణించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం మంగళవారం ప్రకటించారు. తెలంగాణ విలీన దినాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ఆయన ఈ సందర్భంగా తెలంగాణ వాసులకు పిలుపునిచ్చారు. అయితే ఈ సందర్భాన్ని తెలంగాణ విమోచన దినంగానే పరిగణించనున్నట్లు బీజేపీ ప్రకటించింది. ఇక ఈ సందర్భాన్ని అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలన్న రాజకీయ జేఏసీ, బీజేపీ, ఇతర పార్టీల విజ్ఞప్తులను కేసీఆర్ పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వంపై పలు వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.