: మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నామని కేసీఆర్ లేఖ రాశారు. అంతకు ముందు కేసీఆర్ గవర్నర్ నరసింహన్ తో భేటీ ఆయ్యారు. భేటీ సందర్భంగా పలు విషయాలపై గవర్నర్ తో చర్చించారు. తెల్లకార్డులు లేని పేదలందరికీ కార్డులు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. తెల్లకార్డుపై ప్రతి నెలా 30 కేజీల బియ్యాన్ని ఇస్తామని ఆయన ప్రకటించారు. చెరువులలో పూడిక తీసి విస్తీర్ణం పెంచాలని ఆయన పిలుపునిచ్చారు.